కరోనా వ్యాధి సోకిన రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ (Oxygen Concentrators) అందించడానికి దాతలు ముందుకు రావాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య (Mla sandra venkata veeraiah) విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు అమెరికాలోని చిరాగ్ సంస్థ నుంచి రెండు, ఇతర సంస్థల నుంచి మూడు మొత్తం 5 కాన్సంట్రేటర్లను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వైద్యాధికారి వసుమతి దేవికి అందజేశారు.
దాతృత్వంతో ముందుకు వచ్చి సహకారం అందించిన అమెరికాకు చెందిన చిరాగ్ ఫౌండేషన్ వారికి ఇతర దాతలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ మహేశ్, వైద్యాధికారి వసుమతి దేవి తదితరులు పాల్గొన్నారు.