ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాములు నాయక్.. వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఏన్కూరు మండలం సూర్య తండాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
బంజారా నృత్యంతో గిరిజన మహిళలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగులు చల్లుకుంటూ ఎమ్మెల్యేలతో పాటు పలువురు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
![Holi celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-06-28-mla-holi-av-ts10090_28032021152309_2803f_1616925189_1015.jpg)
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం