వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పాటిమీది గుంపు గ్రామ పంచాయతీ సర్పంచి వివాహ వేడుకకు హాజరైన ఆయన డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
జిల్లాలోని పాటిమీది గుంపు గ్రామపంచాయతి సర్పంచి బానోత్ శంకర్- బిందు వివాహ వేడుకకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. తొలుత నూతన వధువరులను ఆశీర్వదించిన ఆయన అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ డాన్స్ చేస్తున్న వారితో జత కలిసి ఆయన కూడా చిందులేశారు. ఎమ్మెల్యే డాన్స్ చూసిన స్థానిక నాయకులు, బంధువులు ఈలలు, చప్పట్లతో మరింత ఉత్సాహపరిచారు.
ఇదీ చదవండి: CP Anjani kumar: 'ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరూ హెల్మెట్ ధరించాల్సిందే'