ETV Bharat / state

వైరాలో పారిశుద్ధ్య పనుల పరిశీలన, స్వచ్ఛతపై అవగాహన - ఖమ్మం జిల్లా వైరాలోని పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే రాములు నాయక్​ పరిశీలించారు

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పారిశుద్ధ్య వారోత్సవాలను ఎమ్మెల్యే రాములునాయక్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.

mla ramulu naik visited special cleaning program in khammam vira
వైరాలో పారిశుద్ధ్య పనుల పరిశీలన, స్వచ్ఛతపై అవగాహన
author img

By

Published : Jun 1, 2020, 7:42 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఏడోవార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములునాయక్​ ప్రారంభించారు. ఆయనతోపాటు అదనపు కలెక్టర్‌ స్నేహలత వార్డులో కలియతిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు స్వచ్ఛత, పారిశుద్ధ్య పనులపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఏన్కూరు మండలం గార్లఒడ్డులో జడ్పీ సీఈవో ప్రియాంక పర్యటించి పల్లె ప్రగతి పనుల పురోగతిని, గ్రామంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కొండకొడిమలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ లింగాల కమలరాజ్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ పనులు పరిశీలించారు.

ఇవీచూడండి: వర్సిటీల ప్రైవేటీకరణకు ప్రభుత్వ కుట్ర: భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.