రోజురోజుకి పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యులు రాములు నాయక్ కోరారు. కారేపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గిరిజనులు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, మాస్కులపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. సింగరేణి పంచాయతీ ఆధ్వర్యంలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని ఎమ్మెల్యే చల్లించారు. మండలంలో ప్రమాదవశాత్తు మరణించిన తెరాస కార్యకర్త పీర్ సాహెబ్ కుటుంబానికి రెండు లక్షల చెక్కును అందజేశారు.
ఇదీ చూడండి: కరోనా బాధితులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ-కాన్ఫరెన్స్