ETV Bharat / state

'వ్యాక్సిన్ వచ్చిందని అశ్రద్ధ వద్దు.. జాగ్రత్త తప్పనిసరి' - khammam updates

ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైద్యాధికారులు పలు సూచనలు చేశారు. టీకా వచ్చిందని అశ్రద్ధగా ఉండొద్దని.. జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

MLA Haripriya inaugurated the Kovid vaccination program at a government hospital here
ఇల్లందులో తొలి వ్యాక్సిన్ తీసుకున్న ఆశ వర్కర్
author img

By

Published : Jan 16, 2021, 3:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు. జిల్లాలో వ్యాక్సిన్ వేస్తున్న 4 కేంద్రాలలో ఇల్లెందు కేంద్రం ఉందని తెలిపిన ఆమె.. కొవిడ్ వ్యాక్సిన్ ఏర్పాట్లను పరిశీలించారు.

ఆందోళన వద్దు..

ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో 30 మందికి వ్యాక్సిన్ అందించేలా వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి వ్యాక్సిన్ ఆశ వర్కర్ ఉమాదేవి తీసుకోగా.. ప్రజా ప్రతినిధులు అధికారులు ఆమెను అభినందించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు 30 నిమిషాలపాటు ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్, పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మస్తాన్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భవిష్యత్​కు ఆశాకిరణం.. కొవిడ్ వ్యాక్సిన్ : మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.