ఖమ్మం జిల్లాలో ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో 43 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని సీపీ విష్ణు వారియర్ అన్నారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్‌పోస్టును ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి సందర్శించారు. ఆశా వర్కర్లకు మాస్కులు, శానిటైజర్, మంచి నీళ్ల బాటిళ్లు అందించారు.
స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఎవరూ బయటకురావొద్దని అన్నారు. లాక్డౌన్ సందర్భంగా పెళ్లిళ్లు, జాతరలు నిర్వహించడం శ్రేయస్కరం కాదన్నారు. కొవిడ్ కట్టడిలో పోలీసులు సేవలు కీలకమని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. సరిహద్దుల్లో మద్యం దుకాణాలు మూసివేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ED: బియ్యం వ్యాపారి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ