ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో తెగిపోయిన ఎల్ఎఫ్ఎల్ మెయిన్ కాలువను, ఎర్రగుంట్లపాడు, రామన్నపాలెం గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట కాలువలను, పొలాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. పంటలకు జరిగిన నష్టం నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలకు దెబ్బతిన్న కాలువలను, రహదారులను తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. జిల్లాలో 129 క్లస్టర్లలో నిర్మితమవుతున్న రైతు వేదికలను దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. వరి, పత్తి పంటల కొనుగోలుకు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఇదీ చదవండిః ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం