ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. మాదారంలో రూ. 35 లక్షల వ్యయంతో జరిపే పనులకు, కొత్త తండాలో రూ. 20.5 లక్షల విలువైన ఆరు పనులకు, మంగలితండాలో రూ. 17.5 లక్షల విలువైన నాలుగు పనులకు, గుంపులగూడెం పరిధిలో రూ. 27 లక్షల విలువైన ఆరు పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
జిల్లాలోని గిరిజన, ఆదివాసీ రైతులు కూడా అడవులను సంరక్షించేలా ఆలోచన చేయాలని మంత్రి కోరారు. గతంలో గ్రామపంచాయతీలకు నిధులు ఉండేవికాదని... ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 12వేల గ్రామాలను నిధులు చేరేలా చర్యలు చేపట్టినట్లు పువ్వాడ వెల్లడించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ గ్రామాలకు నిధులు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఎమ్మెల్యే రాములునాయక్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా సంక్షోభంలో ల్యాప్‌టాప్ అమ్మకాల జోరు