పల్లెల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvvada Ajaykumar) అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు.
ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో పల్లె, పట్టణ ప్రగతిపై మంత్రి పువ్వాడ(Minister Puvvada Ajaykumar) సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా పర్యటించే అవకాశమున్నందున అధికారులు పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను మంత్రి(Minister Puvvada Ajaykumar) ఆదేశించారు.
- ఇదీ చదవండి : పశువుల కాపరి రూ.5 కోట్ల పన్ను మోసం!