రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన తెరాస నాయకులు, పార్టీ శ్రేణులు, పూజలు చేసిన అభిమానులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల ప్రేమాభిమానాలు, ప్రార్థనలే దీవెనలన్నారు. సోమవారం నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నెల 14న స్వల్ప లక్షణాలతో కరోనా పరీక్ష చేయించుకోగా.... మంత్రి పువ్వాడకు పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పూర్తిగా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించారు. 12 రోజులపాటు ఇంటికే పరిమితమైన మంత్రి శనివారం మళ్లీ కొవిడ్ పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌గా తేలింది.