ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గొల్లగూడెంలో రైతు వేదిక భవన నిర్మాణా శంకుస్థాపన శిలాఫలకాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ భవనం రూ. 20 లక్షలతో నిర్మించనున్నారు. అనంతరం జరిగిన సభకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షత వహించారు.
గ్రామపంచాయతీ భవనాన్ని ఆదర్శంగా నిర్మించారని, రైతు వేదిక భవనాలు కూడా ఆదర్శవంతంగా రూపొందించాలని మంత్రి సూచించారు. రైతు బంధు వేదిక నిర్మాణంలో సత్తుపల్లి నియోజకవర్గం ఖమ్మం జిల్లాకే ఆదర్శంగా నిలవాలన్నారు. రైతులందరూ సంఘటితమయ్యేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.
వ్యవసాయరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి జిల్లాలు సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. కరోనాతో ప్రపంచం అల్లాడుతున్న తరుణంలో.. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు కొనియాడారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి