పట్టణ ప్రగతి ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో కొనసాగుతున్న పట్టణప్రగతి కార్యక్రమాన్ని సుడిగాలి పర్యటన ద్వారా పరిశీలించారు. గాంధీచౌక్, 4వ వార్డు, రింగ్‌రోడ్ కూడలి, వైరా జలాశయంపై ట్యాంక్‌బండ్ నిర్మాణం, మార్కెట్‌లకు స్థలాలు పరిశీలించారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్‌లు, అధికారులు, ప్రజలతో మాట్లాడారు.
మినీ పార్కు, జిమ్, రింగ్ కూడలి ఆధునీకరణ, గాంధీచౌక్‌లో పార్కు వంటి వాటిపై పాలకమండలి సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలతతో చర్చించారు. పర్యటన అనంతరం పురపాలక కార్యాయలంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసగించారు. తన ప్రసంగంలోనూ కౌన్సిలర్‌లు, అధికారుల ప్రగతిపై ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశించిన విధంగా పట్టణాలు అభివృద్ది చెందాలన్నారు. ఎలాంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవని పురపాలక పాలక మండలితోపాటు అధికారులకు హెచ్చరించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తడి, పొడిచెత్త సేకరణపై దృష్టిపెట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్‌ను పట్టణప్రగతిపై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!