విద్యుత్ బిల్లులపై కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేయడాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తప్పుపట్టారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కారకులైన నేతలే.. నిరసన తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. ఉనికిని కాపాడుకునేందుకే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీరాయని మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యల్ని పువ్వాడ ఖండించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఆత్కూరుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి పువ్వాడ సమక్షంలో తెరాసలో చేరారు. భవిష్యత్లో మధిరపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: 'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'