ETV Bharat / state

'ఓహ్.. సారొచ్చేది 11 గంటల తర్వాతేనా.. వెరీగుడ్!' - సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

ప్రభుత్వ కార్యాలయాలు.. ఉదయం 10 గంటల సమయంలో ఆకస్మాత్తుగా కార్యాలయానికి వచ్చిన మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే. తీరా చూస్తే కార్యాలయంలో సంబంధిత అధికారులు లేరు. కిందిస్థాయి సిబ్బందిని అడిగితే.. ఇంకా సార్ రాలేదని సమాధానం. ఓహో అలాగా 11 గంటల తర్వాతేనా.. వెరీ గుడ్ అంటూ అమాత్యులు, కలెక్టర్, ఎమ్మెల్యే తిరిగి వెళ్లిపోయారు. ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల సమయపాలన.

వెరీగుడ్
author img

By

Published : Sep 24, 2019, 5:47 PM IST

మండల కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు స్థానికంగా నివాసం ఉండకుండా దూర ప్రాంతాల్లో ఉంటూ.. కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారనే విషయం మంత్రి పువ్వాడ, ఖమ్మం జిల్లా కలెక్టర్ సాక్షిగా బట్టబయలైంది. మంత్రి వస్తున్నారని ముందస్తు సమాచారం అధికారులకు తెలిసినా.. తమకేమీ పట్టనట్లుగా ప్రవర్తించారు. తల్లాడలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యటన సందర్భంగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చారు.

మంత్రి రాకకు 10 నిమిషాల ముందు వచ్చిన వారు.. పోలీస్​స్టేషన్‌ ఎదురుగా ఉన్న జిల్లా సహకార బ్యాంక్​ పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో బ్యాంకు తెరిచి ఉన్నా.. సిబ్బంది ఒక్కరూ లేకపోవడం వల్ల ఆశ్చర్యపోవడం వారి వంతైంది. చేసేదేమిలేక ఎమ్మెల్యే, కలెక్టర్‌ తిరిగి వెళ్లారు.

11 తర్వాతేనా..

మంత్రి వచ్చిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి పక్కనే ఉన్న ఎన్నెస్పీ స్థల పరిశీలనకు వెళ్లారు. ఆ శాఖ వివరాలు తెలుసుకునేందుకు స్వయంగా ఎమ్మెల్యే సండ్ర ఏఈ ఉన్నారా? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంకా రాలేదని కింది స్థాయి సిబ్బంది చెప్పారు. చేతి గడియారంలో సమయం చూసి.. ఓహో.. 11 గంటల తర్వాతేనా.. వెరీ గుడ్ అంటూ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే గండ్ర తిరిగి వెళ్లారు. ఇలా చాలా మండలాల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

11 గంటల తర్వాతేనా.. వెరీగుడ్

ఇవీ చూడండి;హుజూర్​నగర్​ ఉప ఎన్నిక ఈసీకి ప్రతిష్ఠాత్మకమే..!

Intro:TG_KMM_12_24_COLLECTER_MLA VISIT_AV1 _TS10090. స్క్రిప్ట్ : ఎఫ్ టి పి ద్వారా

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.