ETV Bharat / state

నిబంధనల అమలేది..? వలస బతుకు బేఖాతరు - migrants problems in state boarder

సొంత గ్రామాలకు వలస కూలీల తరలింపులో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను ఒకేసారి మూకుమ్మడిగా లారీల్లో, ఇతర వాహనాల్లో కుక్కి పంపుతున్నారు.

migrants-faced-many-problems-intelangana-boarder
నిబంధనలేవి.. వలస బతకు బేఖాతరు
author img

By

Published : May 4, 2020, 12:24 PM IST

వలస కూలీల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులిచ్చినా... ఎక్కడా అమలు కావడం లేదు. ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూలీలను తరలిస్తున్నా.. ఎక్కడా జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదు. వలస జీవితాలపై నిర్లక్ష్యం వహిస్తూ.. లారీలు, వ్యాన్లలో కుక్కి పంపిస్తున్నారు.

ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి మండలాలతో పాటు సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రాంతాల నుంచి లారీలలో కూలీలు ఇరుక్కుని వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం రైళ్లు, బస్సులలో భౌతిక దూరం పాటిస్తూ.. ప్రయాణం చేయాలని చెబుతున్నా.. ఎవరూ పాటించడం లేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.