తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వారి ఉనికిని కాపాడుకునేందుకు అనేక కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారుల పనులను అడ్డుకుంటున్నారు.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉసురు నుంచి పూజారి కాంకేర్ వరకు వేస్తున్న రహదారి పనులు నిలిపి వేయాలని ఉరుసు వద్ద రోడ్లపై మావోయిస్టులు కందకాలు తవ్వారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తే మావోయిస్టుల ఉనికికి ఆటంకం కలుగుతుందని భావించి ఈ చర్యకు పాల్పడ్డారని స్థానికులు చెప్పుకుంటున్నారు.
ఇదీ చదవండి: మావోయిస్టులూ.. ఆయుధాలు వదిలి లొంగిపోండి