సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం వల్ల సరిహద్దు జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ల వారీగా అధికారులు లాక్డౌన్ అమలును ఉన్నతాధికాలు పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా, తల్లాడ ఠాణాల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఏసీపీ సత్యనారాయణ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. సరిహద్దు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉంటేనే అనుమతిస్తున్నారు.
వైరా పురపాలికలో డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తిస్తున్నారు. ఏన్కూరులో వాలంటీర్లతోపాటు కానిస్టేబుళ్లు... దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడడం, సమయపాలన, రహదారిపైకి వచ్చే వాహనాల నియంత్రణలో జిల్లాలోనే గుర్తింపు పొందుతున్నారు. పోలీసు అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు లాక్డౌన్ పరిశీలనలో భాగస్వాములవుతున్నారు.
ఇవీ చూడండి: సీఎంఆర్ఎఫ్కు పెళ్లి ఖర్చులు..వరుడికి కేటీఆర్ ప్రశంసలు