ఖమ్మం జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావటం వల్ల... రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉపాధి కోల్పోయి ఇంటివద్దే ఉంటున్న పేదలను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. పేదలకు, వలస కార్మికులకు భోజనం, నిత్యావసరాలు అందజేస్తున్నారు. నగరంలోని పలు చెక్‌పోస్టుల వద్ద యువకులు వాలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇదీ చూడండి:- రూ.600తో 20 నిమిషాల్లోపే కరోనా పరీక్ష ఫలితాలు