ETV Bharat / state

పేట్రేగిపోతున్న భూఅక్రమార్కులు.. రాజకీయ పలుకుబడితో కబ్జా - Land grab in Khammam district

వారంతా సామాన్య, మధ్యతరగతి ప్రజలు. పైసా పైసా కూడబెట్టుకుని ఇళ్ల స్థలాలు కొన్నారు. భవిష్యత్‌లో మంచి ధర పలికి బతుకులు మారతాయని ఆశపడ్డారు. కానీ.. కొన్నాళ్లకే ప్లాట్ల హద్దు రాళ్లు చెరిగిపోయాయి. అవి పంట భూములుగా దర్శనమిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి, కొందరు ఉద్యోగుల లాలూచీ కారణంగా .. ఖమ్మంలోని ఏడెకరాల విలువైన భూముల్లో అక్రమార్కులు దర్జాగా పాగా వేశారు. ఇళ్ల స్థలాలు చూసుకునేందుకు వచ్చి ఖిన్నులైన బాధితులంతా ఏకమై న్యాయం కోసం పోరుబాట పట్టారు.

పేట్రేగిపోతున్న భూఅక్రమార్కులు.. రాజకీయ పలుకుబడితో కబ్జా

author img

By

Published : Jan 26, 2021, 9:18 AM IST

పేట్రేగిపోతున్న భూఅక్రమార్కులు.. రాజకీయ పలుకుబడితో కబ్జా

ఖమ్మం నగరం చుట్టూ దాదాపు 20 కిలోమీటర్ల మేర స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు భూములు కొనలేని పరిస్థితి. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇదే సమయంలో భూఅక్రమాలూ యథేచ్చగా సాగుతున్నాయి. ఒకే స్థలం రెండుసార్లు రిజిష్ట్రేషన్లు, దౌర్జన్యంతో ఇతరుల విలువైన స్థలాలను ఆక్రమించడం, రహదారుల విక్రయ ఘటనలు.. సీలింగ్ భూముల్లో స్థిరాస్తి దందాలు, బహుళ అంతస్తు భవనాల పేరుతో ఇళ్ల విక్రయాల్లో మోసాలు.. ఇలా అనేక రకాల భూఅక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా రఘునాథపాలెం మండలంలో మరో భూమాయ వందలాది మంది బాధితులను నట్టేట ముంచేసింది.

అధికారుల అండతో...

రేగులచలక రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 28, 29లలో ఏడెకరాల వెంచర్‌లో.. 2007-13 మధ్య కాలంలో మొత్తం 200 ఇళ్ల స్థలాలను విక్రయించి జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు ప్లాట్లు కొన్నారు. భవిష్యత్‌లో మంచి ధరలు పలుకుతుందనే ఆశతో కొందరు తమ బంధువులు, స్నేహితులతోనూ స్థలాలు కొనుగోలు చేయించారు. ఐతే, నగరం చుట్టూ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో అక్రమార్కులు కొత్త తరహా దందాకు తెరలేపారు. భూదస్త్రాల ప్రక్షాళనను ఆసరాగా చేసుకుని దాదాపు 13 ఏళ్ల క్రితమే విక్రయించిన భూమికి సైతం... మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టా పొందారు. ఇళ్ల స్థలాలకు వేసిన హద్దు రాళ్లను తొలగించి 7 ఎకరాలకు కంచె వేశారు. అధికారులను లోబర్చుకుని పాసుపుస్తకాలు సృష్టించి ప్రస్తుతం రైతు బంధు సాయం కూడా పొందుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యథేచ్ఛగా భూ కబ్జా

వివాదాస్పద స్థలం ఇళ్ల స్థలాలుగా మారినా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వ్యవసాయ భూమిగానే ఉండిపోవడం ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. ఈ లొసుగును ఆసరాగా చేసుకుని కొంతమంది మళ్లీ ఆ భూమిని పట్టాదారు నుంచి నేరుగా వ్యవసాయ భూమిగా కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో కొత్తగా కొనుగోలు చేసిన వ్యక్తులు పట్టాదారుగా కనిపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనక కొందరు మండలానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి. ఇదే భూమికి కొత్తగా కొన్న రైతుల పేరు మీద, గతంలో ఇళ్ల స్థలాల కొనుగోలుదారుల పేరు మీదా ఈసీ నక్షా వస్తుండటం పట్ల పలువురు విస్మయం చెందుతున్నారు.

కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తే... దౌర్జన్యంగా ఆక్రమించుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులంతా పోరుబాట పట్టారు. వారంతా ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.