ETV Bharat / state

Kishan Reddy Khammam District Tour : 'కాంగ్రెస్, బీఆర్​ఎస్ పాలన చూశాం.. బీజేపీకి అవకాశం ఇవ్వండి' - బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఖమ్మం పర్యటన

Kishan Reddy Comments on BRS and Congress : కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒకటేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందైనా.. తర్వాతైనా ఆ రెండు పార్టీలు కలవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసమే ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటిస్తుందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Kishan Reddy comments on KCR
Kishan Reddy fires on brs government
author img

By

Published : Aug 18, 2023, 8:24 PM IST

Kishan Reddy Fires on BRS Government : రాష్ట్రంలో అభ్యర్థులను మందు ప్రకటించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజల చేతిలో భంగపాటు తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటనలో.. కమలం పార్టీకి ఎలాంటి తొందరలేదని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని తమ పార్టీ భావిస్తుందని చెప్పారు. ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఖమ్మం జిల్లాలో పర్యటించారు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఖమ్మంకు వచ్చిన కిషన్‌రెడ్డికి.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వరంగల్ క్రాస్ రోడ్డులో భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. అనంతరం నగరంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాసేపు బుల్లెట్ నడిపిన కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

Kishan Reddy Comments on KCR : తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి.. ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కుటుంబ పాలన, ఆధిపత్యం, అహంకారమే పరిపాలిస్తున్నాయని మండిపడ్డారు. వెన్నుపోటు, మోసాలు, అబద్ధాలు, అవినీతికి కల్వకుంట్ల కుటుంబం.. కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. దేశంలోనే బీఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో అగ్రస్థానంలో ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నేతలు మాఫియాగా మారి.. ప్రజా సంపదను దోచుకుంటున్నారని కిషన్‌రెడ్డి (Kishan Reddy Fires on BRS) ఆరోపించారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన మంత్రి వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న పథకాలు సక్రమంగా అమలు చేయకుండా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు.. కొత్త పథకాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందైనా.. తర్వాతైనా కాంగ్రెస్, భారత్‌ రాష్ట్ర సమితి కలవడం ఖాయమని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు.

దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు అస్తిత్వం కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. అందుకే చట్టసభల్లో అడుగుపెట్టడం కోసం ఏదో ఒక పార్టీతో అవి.. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. వ్యక్తిగత అవసరాలు, రాజకీయ అవకాశాల కోసం వామపక్ష పార్టీల నేతలు అధికార బీఆర్ఎస్‌కు కొమ్ముకాయడాన్ని.. అందులోని కార్యకర్తలే జీర్ణించుకోవడం లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

"తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం మరువలేనిది. కమ్యూనిస్టులవి అవకాశవాద రాజకీయాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పాలన చూశాం.. బీజేపీకి అవకాశం ఇవ్వండి. రైతు రుణమాఫీ అమలులో ప్రభుత్వం జాప్యం చేసింది. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు డీఫాల్టర్లుగా మారారు. వరదలతో రైతులు నష్టపోయినా పరిహారం ఇవ్వలేదు. దళితబంధును బీఆర్ఎస్ నాయకుల బంధుగా మార్చారు. ఎన్నికల కోసమే కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. మద్యం టెండర్ల డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కమ్యూనిస్టులవి అవకాశవాద రాజకీయాలు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పాలను చూసినందువల్ల బీజేపీకి అవకాశం ఇవ్వాలి." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy Khammam District Tour రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజల చేతిలో భంగపాటు తప్పదు

Kishan Reddy Told to BJP Full Support RTC Bill : వేల ఎకరాల ఆర్టీసీ ఆస్తులపై ముఖ్యమంత్రి కుటుంబం కన్నేసింది : కిషన్ రెడ్డి

Kishan Reddy fires on KCR : 'నిజాంలా ఇల్లు నిర్మించుకున్నారు.. పార్టీలకు స్థలాలు కేటాయించారు.. మరి పేదవారికి ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.