రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో ఎలాంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవని... ఖమ్మం జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి ప్రియాంక తెలిపారు. పనుల పురోగతిని ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. ఏన్కూరు మండలం బురద రాఘవాపురం గ్రామంలో వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం పనులను కేత్రస్థాయిలో పరిశీలించారు.

పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: 'మంత్రి కేటీఆర్ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం'