Congress Leaders fires on BRS : ఖమ్మంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు జనాన్ని రాకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు చేస్తున్నారని.. కాంగ్రెస్ సభకు వస్తున్న వాహనాల్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేవని జప్తు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆర్టీసీ బస్సుల్ని బుక్ చేస్తే ఇవ్వలేదని... ప్రైవేటు వాహనాల్లో వస్తుంటే.... తనిఖీల పేరిట జప్తు చేస్తున్నారని మండిపడ్డారు.
Revanthreddy Complaint to DGP on Khammam Police : ఖమ్మం సభకు రాకుండా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల్ని పోలీసులు అడ్డుకుంటున్నారని డీజీపీ అంజనీకుమార్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీజీపీతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ మాట్లాడారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి సభకు బయలుదేరిన వాహనాలను అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్ అన్నారు. సభకు వచ్చే వాహనాలు, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అడ్డుగోడలు దాటుకునైనా సభను విజయవంతం చేస్తామని మధుయాస్కీ స్పష్టం చేశారు. సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని డీజీపీ అంజనీకుమార్ రేవంత్‌రెడ్డికి తెలిపారు.
Khammam Congress Meeting : కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలా చేస్తున్నారని ఆ పార్టీ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. ఖమ్మం సభ అంటే బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారన్న ఆమె... పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎంత.. ఇవ్వకపోతే ఎంత.. తమ పార్టీ కార్యకర్తలు నడిచైనా సరే సభకు వస్తారని వ్యాఖ్యానించారు. పోలీసులు బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంలా వ్యవహరించడం సరికాదని... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క ఖండించారు.
తనిఖీల పేరుతో కార్యకర్తల వాహనాల అడ్డగింత : ఖమ్మం జనగర్జన సభకు వెళ్లకుండా అడుగడుగునా వాహన తనిఖీల పేరుతో పోలీసులు, రవాణాశాఖ అధికారులు ప్రతి ఒక్కరిని ఏదో ఒక కారణం చెప్పి వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం జరిగినా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన కొమ్ము నృత్య కళాకారులు ప్రదర్శన చేయడం సర్వసాధారణమన్న వీరయ్య... వారిని తీసుకెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారని మండిపడ్డారు. అలాగే వారి సామగ్రి, వాహనాలను స్వాధీనం చేసుకుని భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఎమ్మెల్యే వీరయ్య ధ్వజమెత్తారు.
తెలంగాణలో కొత్త అధ్యాయానికి బ్లూప్రింట్ సిద్ధం : తెలంగాణ రాష్ట్రంలో సమష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి తమ బ్లూ ప్రింట్ సిద్ధమైందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా తెలంగాణ అభివృద్ది, పురోగతికి తాము కట్టబడి ఉన్నామని ఖర్గే ట్విటర్ వేదికగా వెల్లడించారు. 3.8కోట్ల తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ జనగర్జన ద్వారా రాహుల్‌గాంధీ ఇవాళ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపిస్తారని మల్లికార్జున ఖర్గే వివరించారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క 1360కిలోమీటర్ల సుదీర్ఘా పాదయాత్రను పూర్తి చేసినందున అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం సభలో పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్నారు.
-
3.8 Crore people of Telangana want change.
— Mallikarjun Kharge (@kharge) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Shri @RahulGandhi's #TelanganaJanaGarjana grand rally shall be voicing their shared aspirations, today.
We congratulate CLP leader, Shri @BhattiCLP on the completion of our 1360 km long Padayatra, today at Khammam.
Several senior… pic.twitter.com/MSYwlR3mrF
">3.8 Crore people of Telangana want change.
— Mallikarjun Kharge (@kharge) July 2, 2023
Shri @RahulGandhi's #TelanganaJanaGarjana grand rally shall be voicing their shared aspirations, today.
We congratulate CLP leader, Shri @BhattiCLP on the completion of our 1360 km long Padayatra, today at Khammam.
Several senior… pic.twitter.com/MSYwlR3mrF3.8 Crore people of Telangana want change.
— Mallikarjun Kharge (@kharge) July 2, 2023
Shri @RahulGandhi's #TelanganaJanaGarjana grand rally shall be voicing their shared aspirations, today.
We congratulate CLP leader, Shri @BhattiCLP on the completion of our 1360 km long Padayatra, today at Khammam.
Several senior… pic.twitter.com/MSYwlR3mrF
ఇవీ చదవండి :