KTR Comments on Congress : అధికారంలోకి రారని తెలిసే కాంగ్రెస్ వాళ్లు నోటికివచ్చిన హామీలు ఇస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్(BRS)లో తిరిగి చేరిన భద్రాచలం నేత తెల్లాం వెంకట్రావును ఆయన స్వాగతించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కేటీఆర్ సమక్షంలో వెంకట్రావుతో పాటు ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇచ్చే ఏకైక సీఎం కేసీఆర్‌నే అని.. మిషన్ భగీరథ(Mission Bhagiratha) దేశానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. దేశమంతా అడవులను తొలగిస్తుంటే.. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం అడవులు పెరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని అన్నారు. ఏం చూసి మరి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ఘాటుగా స్పందించారు.
Khammam Congress Leaders Joined BRS : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు ధాన్యాన్ని తెలంగాణకు తెచ్చి అమ్ముతున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని కుటుంబం రాష్ట్రంలో ఒక్కటైనా ఉందానని ప్రశ్నించారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఈ విషయాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిన.. అధికారంలోకి రామని తెలిసే నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచామని గుర్తు చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చి.. రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
"ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చే ఏకైక సీఎం కేసీఆర్. అందుకు మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారా? రైతుబంధు, రైతు బీమా ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఏం చూసి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలి? కాంగ్రెస్ పాలితరాష్ట్రాల ప్రజలు ధాన్యాన్ని తెలంగాణకు తెచ్చి అమ్ముతున్నారు. పిల్లల నుంచి పెద్దల దాక అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అధికారంలోకి రామని తెలిసే కాంగ్రెస్ వాళ్ల నోటికివచ్చిన హామీలు ఇస్తున్నారు." - కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి
భద్రాద్రి దేవాలయాన్ని తీర్చిదిద్దే బాధ్యత బీఆర్‌ఎస్‌దే : స్వాతంత్య్ర భారతంలో 70 ఏళ్లలో రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చిన ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. కొందరు నాయకులు కూడా పథకాలు తీసుకుంటున్నారు.. పైగా కేసీఆర్‌నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. భద్రాద్రి రామాలయాన్ని తీర్చిదిద్దే బాధ్యత బీఆర్‌ఎస్ పార్టీదే అని స్పష్టం చేశారు. భద్రాచలంలో వరద నివారణకు శాశ్వత కరకట్టలు కడతామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చాలా మంది ఉపాధి పొందుతున్నారని కేటీఆర్ తెలిపారు.
BRS Joinings In Khammam : కాంగ్రెస్ వాళ్లు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారని.. 50 ఏళ్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొండి.. ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కే వెయ్యండని సూచించారు. రానున్న రోజుల్లో ప్రభల శక్తిగా బీఆర్‌ఎస్ ఎదుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Political Heat in Khammam : ఖమ్మం గుమ్మంలో రాజుకుంటున్న రాజకీయం
Puvvada Counter to Ponguleti : 'పొంగులేటి.. డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నారు'