పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్ మైదానం నుంచి ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన తీశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కల్పనా దేవి ఫ్లెక్సీతో ప్రదర్శనలు చేశారు.
పని భారం తగ్గించాలని నినాదాలు చేశారు. వారికి పలువురు నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని, పనికి ఆహార పథకం పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నాయకులు కోరారు. పని వేళలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రేపు చార్మినార్కి వస్తా.. దమ్ముంటే కేసీఆర్ రావచ్చు: సంజయ్ సవాల్