ETV Bharat / state

పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు - నామినేషన్​ను అడ్డుకుంటున్నారని ఈసీకి ఫిర్యాదు

Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 7:11 AM IST

Updated : Nov 9, 2023, 4:07 PM IST

07:07 November 09

తెల్లవారుజామున 3 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు

  • నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!?

    బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!?

    రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని…

    — Revanth Reddy (@revanth_anumula) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

IT Raids in Ponguleti Srinivas Reddy : తెలంగాణలో మరోసారి ఆదాయపన్ను శాఖ దాడులు కలకలం రేపాయి. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేప్టటారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో ఇవాళ వేకువజామున 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి పొంగులేటితో సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

IT Raids in Hyderabad Today : అదేవిధంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో ఉన్న పొంగులేటి నివాసం, రాఘవ కన్‌స్ట్రక్షన్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, కార్యకర్తలు పొంగులేటి నివాసానికి భారీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ నేతపై కావాలనే బీఆర్​ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు నేడు నామినేషన్‌ వేసేందుకు ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశవుతోంది.

హైదరాబాద్​లోని కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు

Ponguleti Srinivas Reddy Responds on IT Raids : తనపై ఆదాయపన్ను శాఖ దాడులపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ , బీజేపీ కలిసి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని అన్నారు. భారతీయ జనతా పార్టీలోకి రావాలని తనపై ఒత్తిడి చేశారని.. ఆ పార్టీలోకి రాలేదని, అదేవిధంగా హస్తం పార్టీ గ్రాఫ్‌ పెరిగిందని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే ఐటీ సోదాలు జరుగుతాయని తనకు తెలుసని.. తాను ఉహించినట్లే జరుగుతున్నాయని చెప్పారు. బీజేపీ ఎజెండా ఒక్కటేనని.. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవకూడదని ప్రయత్నిస్తున్నారన్నారు.

బీఆర్ఎస్​ను అధికారంలోకి తేవడానికే బీజేపీ శతవిధాలా కృషి చేస్తోందన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రవర్తన మూర్చుకోపోతే మూల్యం చెల్లించుకోవాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే నామినేషన్‌ వేసే రోజే తనిఖీలు జరుపుతున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ఉదయం నుంచి సుమారు 30 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చివరికి తనను జైలులో పెట్టినా వెనక్కి తగ్గనని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు జైలులో ఉండేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్ని చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తన నామినేషన్​ను అడ్డుకునేందుకు ఐటీ దాడులు చేయిస్తున్నారని పొంగులేటి ఈసీకి ఫిర్యాదు చేశారు.

Revanth Reddy Respond on IT Raids in Congress Leaders : మరోవైపు కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (PCC president Revanth Reddy) అన్నారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు దేనికి సంకేతమని అడిగారు. బీఆర్ఎస్‌, బీజేపీ నేతల ఇండ్లపై ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైందని.. ఆ సునామీని ఆపడానికి చేస్తున్న కుతంత్రమే ఇది అని మండిపడ్డారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.

ఫీనిక్స్‌ సంస్థలో ఐటీ సోదాలు, ఏకకాలంలో 20 చోట్ల 30 బృందాల తనిఖీలు

Ponguleti Srinivas Reddy Interesting Comments : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే ఐటీ అధికారులు తనిఖీ చేసేందుకు ఆయన నివాసానికి చేరుకోవడం గమనార్హం. బుధవారం రోజున పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తనపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల వరుసగా కాంగ్రెస్‌ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయని.. బీఆర్ఎస్‌, బీజేపీ కుమ్మక్కై ఈ తరహా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుస్తుందనటానికి ఈ దాడులే నిదర్శనమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్​, బీజేపీల నుంచి కాంగ్రెస్​ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు హస్తం పార్టీ నేతలకు ఇబ్బందులు తప్పవని .. ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పొంగులేటి వెల్లడించారు.

రాజకీయ కుట్రలో భాగంగానే నాపై ఐటీ దాడులు : బడంగ్​పేట్ మేయర్​ పారిజాత

IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం

Last Updated : Nov 9, 2023, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.