ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం రెడ్డిగూడెంలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. సంయుక్త కలెక్టర్ అనురాగ్ జయంత్, డీఆర్డీవో ఇందుమతి గ్రామంలో మొక్కలు నాటారు. మొక్కలు చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి