AAP MLA Gurpreet Gogi Shot Dead : లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత గురుప్రీత్ గోగి శుక్రవారం రాత్రి బుల్లెట్ గాయాలతో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే 'శుక్రవారం రాత్రి గురుప్రీత్ పొరపాటున తనను తానే తలపై కాల్చుకున్నట్లు' ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారని పోలీసులు తెలిపారు.
#WATCH | Ludhiana, Punjab: DCP Jaskaran Singh Teja says, " gurpreet gogi was declared brought dead at the hospital, his body has been kept at the mortuary in dmc hospital. post-mortem will be conducted. as per the family members, he shot himself accidentally, he sustained bullet… https://t.co/sZEFYD9bdc pic.twitter.com/xqGPCMnlj1
— ANI (@ANI) January 11, 2025
"శుక్రవారం సుమారు 12 గంటల సమయంలో గురుప్రీత్ గోగి ఇంట్లో కాల్పులు జరిగాయి. గురుప్రీత్ తలపై బుల్లెట్ గాయాలు కావడం వల్ల కుటుంబ సభ్యులు, ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం, ప్రమాదవశాత్తు గురుప్రీత్ తనను తానే తుపాకీతో కాల్పుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. పోస్ట్‌మార్టం అయిన తరువాత మరణానికి గల అసలు కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం" అని లూథియానా డీసీపీ జస్కరణ్ సింగ్ తేజ పేర్కొన్నారు.
మరణానికి కొన్ని గంటల ముందు గురుప్రీత్ గోగి - విధాన సభ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్, ఆప్ ఎంపీ బల్బీర్ సింగ్ సీచెవాల్‌తో సమావేశమయ్యారు. ఇందులో 'బుద్ధ నల్ల' (బుధ వాగు)ను శుభ్రపరిచే అంశంపై చర్చించారు.
రాజకీయ నేతల సంతాపం!
గురుప్రీత్ గోగి మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లూథియానాలోని ఆయన నివాసానికి వచ్చి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
"ఈ క్లిష్ట సమయంలో గురుప్రీత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను."
- అమన్ ఆరోరా, పంజాబ్ ఆప్ అధ్యక్షుడు
ఆప్‌లో కీలకపాత్ర
2022లో కాంగ్రెస్ పార్టీని వీడిన గురుప్రీత్ గోగి ఆప్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, లూథియానా నుంచి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన భరత్ భూషణ్ ఆశును ఓడించారు.