Inter student died of heart attack: రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా టీనేజీ యువకులు, జిమ్‌లో కసరత్తు చేస్తున్న యువకులు ఉన్నట్టుండి నేల కొరిగిపోతున్నారు. ఒకప్పుడు వయుస్సు పైబడిన వారిలో చూసే ఈ సమస్యలు ఇప్పడు యుక్త వయుస్సు వారిలో కనిపించడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా ఇవాళ ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్థి, పెద్దపల్లి జిల్లాలో బాడీ బిల్డర్ మృతి చెందిన ఘటన మరింత కలచివేస్తోంది.
స్నేహితులతో మాట్లాడుతుండగా..: ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇంటర్మీడియట్ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. జిల్లాలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మరీదు రాకేశ్ విద్యార్థి మధిర పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం కాలేజీకి వెళ్లే ముందు ఇంటి ఆవరణలో మిత్రులతో కలిసి సరదాగా మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మధిరలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రాకేశ్ గుండెపోటుతోనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో సొంత ఊళ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Body builder dies of heart attack in Peddapalli: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బిల్డర్ ఠాకూర్ శైలేందర్‌సింగ్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పట్టణంలోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న శైలేందర్.. వేములవాడలోని తన సోదరుడి వద్దకు వెళ్లేందుకు బ్యాగ్‌తో బయటకు వచ్చి ఇంటి తాళం వేశారు. అనంతరం లిప్ట్ వద్ద వేచి చూస్తూండగా కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. అతనకి గుండెపోటుకు గురైనప్పడు ఛాతిని గట్టిగా పట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది.
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబులు: కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఎల్బీనగర్కు చెందిన ఓ యువకుడు బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనికి సీపీఆర్ చేసి ఛాతిని గట్టిగా అదిమి అతని ప్రాణాలు నిలబెట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి హరీశ్‌రావు కానిస్టేబుల్‌కు ప్రత్యేకంగా సన్మానించారు. సీపీఆర్ విధానం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సీపీఆర్‌పై శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మొదట విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
కుప్పకూలిన యువకుడు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
డ్యాన్ చేస్తుండగా గుండెపోటు సెకన్లలోనే మృత్యు ఒడిలోకి
అధిక వ్యాయామంతో గుండెపోటు వస్తుందా?.. రోజుకు ఎంతసేపు చేయాలి?