ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరగడం, సరైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం వల్ల.. అక్రమ మద్యం అమ్మకాలకు రెక్కలొచ్చాయి. తెలంగాణ నుంచి ఏపీకి మద్యాన్ని దొంగచాటుగా తరలిస్తున్నారు.
పాల క్యానులో మద్యం..
ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు పాల క్యానులో మద్యం తరలిస్తుండగా అధికారులు నిఘాపెట్టి పట్టుకున్నారు. తిరువూరు సమీపంలో ఎక్సైజ్ అధికారులు ఓవ్యక్తిని అరెస్టు చేశారు.
ఒకరి అరెస్టు, ద్విచక్ర వాహనం సీజ్..
మర్లకుంటకు చెందిన నూతి ప్రదీప్ పాల క్యానులో మద్యంను తిరువూరుకు తరలిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీహరి తెలిపారు. పట్టుబడిన వ్యక్తి నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి.. అతడిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం సీసాలు పట్టివేత