ఖమ్మంలో కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరడం వల్ల లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్డౌన్ పూర్తయ్యేంతవరకు వాహనాలు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు.
నిబంధనలు పాటిస్తేనే కరోనాను కట్టడి చేయొచ్చని... కష్టకాలంలో ప్రజలంతా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి : వెళ్లలేరు.. ఉండలేరు..