ఖమ్మం జిల్లా వైరాలో ఐద్వా నిరసన చేపట్టింది. కరోనా వైరస్ సోకిన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరింది. వైరాలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. పట్టణంలో నాలుగు వందలకు పైగా ప్రజలు వైరస్ బారిన పడినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించింది.
కరోనా సోకిన వారికి అవసరమైన వైద్యం అందించటానికి ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా హోం క్వారంటైన్లో ఉంచుతున్నారని ఐద్వా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత విమర్శించారు. దీని వల్ల కుటుంబ సభ్యులందరికీ వైరస్ వ్యాపిస్తుందన్నారు. వైరాలో కరోనా నియంత్రణ కోసం వెంటనే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చూడండి:జీఎస్టీ పరిహారంపై బిహార్ రూటే సెపరేటు