ETV Bharat / state

వివాహిత అనుమానస్పద మృతి.. బంధువుల ఆందోళన - women death news in khammam

ఖమ్మం జిల్లా ముదిగొండ పరిధిలోని బాణాపురం తండాలో ఓ వివాహిత అనుమానస్పదంగా మృతి చెందింది. అదనపు కట్నం కోసం అత్త, భర్త కలిసి తమ కూతురిని కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని ముదిగొండ పరిధిలో చోటుచేసుకుంది.

Husband and Aunt killed women for extra dowry!
అదనపు కట్నం కోసం వివాహితను కొట్టిచంపిన భర్త, అత్త!
author img

By

Published : Feb 13, 2020, 3:51 PM IST

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం తండాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త, అత్త వరకట్నం కోసం ఓ వివాహితను కొట్టి చంపారంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

బాణాపురం గ్రామానికి చెందిన తేజావత్​ ఉపేందర్​ నాయక్​ సీఆర్పీఎఫ్​ ఉద్యోగి. అతనికి సూర్యాపేట జిల్లా పాలారం తండాకు చెందిన కల్యాణితో 3 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 14 నెలల చిన్నారి ఉంది. భర్త ఉపేందర్​, అత్త పద్మ వరకట్నం కోసం తరచూ... వేధిస్తూ ఉండేవారని మృతురాలి బంధువులు ఆరోపించారు. మూడు రోజుల క్రితమే 16 లక్షల రూపాయలు కట్నం డబ్బులను ఉపేందర్​ నాయక్​ తల్లిదండ్రులకు అప్పగించామని కల్యాణి తల్లిదండ్రులు వెల్లడించారు.

నిన్న విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి కల్యాణి మృతి చెంది జీవచ్ఛవంలా పడి ఉందని ఉపేందర్​ నాయక్ తెలిపారు. గ్రామస్థులు ఈ విషయాన్ని కల్యాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

వరకట్నం సరిపోలేదంటూ చిత్రహింసలకు గురిచేస్తూ... భర్త, అత్త కలసి తమ కూతురిని చంపారని ఆగ్రహించిన బంధువులు... ఉపేందర్​ నాయక్​ ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులపై విరుచుకు పడ్డారు. దీనితో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్తుండగా బంధువులు అడ్డుకున్నారు. దీనితో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న ఏసీపీ వెంకటరెడ్డి బంధువులతో మాట్లాడి సర్ది చెప్పి పోలీసు వాహనంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ముదిగొండ ఎస్సై సతీష్​కుమార్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అదనపు కట్నం కోసం వివాహితను కొట్టిచంపిన భర్త, అత్త!

ఇవీ చూడండి: అక్కన్నపేటలో కాల్పుల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.