ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ హమాలీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పెవిలియన్ మైదానం నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ తీశారు. డిపో ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. న్యాయమైన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్దాం: కోదండరాం