ETV Bharat / state

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - gutka

టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఒక్కరోజులోనే భారీగా గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో తనిఖీలు చేపట్టి 11 లక్షల 50 వేల విలువ గల గుట్కాను పట్టుకున్నారు.

gutka-packets-seized-at-wyra-in-khammam-district
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
author img

By

Published : May 31, 2020, 9:49 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు భారీగా గుట్కా నిల్వలను పట్టుకున్నారు. టాస్క్​ఫోర్స్​ సీఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎస్సైలు మేడా ప్రసాద్, రఘు, సిబ్బంది తనిఖీలు చేసి 11 లక్షల 50 వేల విలువ గల గుట్కా స్వాధీనం చేసుకున్నారు .మల్లికార్జున్​ అనే వ్యక్తి కారులో 9 లక్షల 87 వేల విలువగల గుట్కా నిల్వలను తరలిస్తుండగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.

మరో వ్యక్తి వైరాకు చెందిన శ్రీనివాసరావు ఇంట్లో నిల్వ ఉన్న రెండు లక్షల విలువ గల గుట్కా సంచులను పట్టుకున్నారు.ఇద్దరు వ్యక్తులతో పాటు కారును అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు. వైరా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో పొలం వద్దే రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.