ETV Bharat / state

సహజ ప్రతిభ.. అత్యున్నత విద్యాసంస్థలో ఐఐటీ సీటు

తండ్రిది రోజువారీ బతుకుపోరాటం.. తల్లి ఇల్లిల్లూ తిరిగి పనులు చేస్తోంది. వారు ఉండేది మురికివాడ. ఈ కష్టాల్ని అధిగమించి... సమాజంలో గౌరవ స్థానంలో నిలవాలంటే చదువుకొక్కటే మార్గమని నమ్మింది... ఆ పేదింటి బిడ్డ. ఫీజులు కట్టే స్తోమత తల్లిదండ్రులకు లేదని... టాప్‌ మార్కులతో గురుకులాల్లో సీటు సంపాదించింది. కలెక్టర్ అవ్వాలనే లక్ష్యసాధనకు గురుకులానే పునాదిగా ఉపయోగించుకుంది. లక్షలకు లక్షలు ఫీజులు పోసినా సీటు సంపాదించడం కష్టంగా ఉండే ఐఐటీ బాంబేలో ప్రవేశం దక్కించుకుంది... గురుకుల విద్యార్థి సహజ.

Gurukula student Sahaja
ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజినీరింగ్ సీటు సాధించిన గురుకుల విద్యార్థిని సహజ
author img

By

Published : Nov 17, 2021, 10:37 PM IST

అవును మీరు వింటుంది నిజమే. 5వ తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఈ విద్యార్థే.. ఐఐటీ బాంబేలో(IIT BOMBAY) అడుగుపెట్టనుంది. ఈ వాడలో ఎదిగిన ఈ విద్యార్థే ఇప్పుడు బాంబే ఐఐటీ క్యాంపస్‌లో(IIT CAMPUS) ఉన్నత విద్య అభ్యసించనుంది. ఈ చిన్న ఇంట్లో నివసించే ఈ పేదింటి బిడ్డే... సివిల్‌ ఇంజినీర్‌గా మారి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టనుంది.

చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే..

ఖమ్మం జిల్లాలోని వల్లభికి చెందిన(khammam) చెందిన సహజ కుటుంబం పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు(hyderabad) వలసవచ్చారు. తండ్రి గోపాల్‌రావు ఓ చిన్న ఉద్యోగి. తల్లి ప్రగతి చుట్టుపక్కల ఇళ్లలో వంటపని చేస్తూ కుటుంబా న్ని నడిపిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలంటే చదువొక్కటే మార్గమని భావించింది సహజ. టాప్‌ మార్కులతో 5 వ తరగతి నుంచే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదవుకునేలా ప్రవేశాలు సంపాదించింది.

అనవసర ఖర్చులు మాని పుస్తకాలకే ప్రాధాన్యం

తోటి విద్యార్థులు ఆట, పాటలు వంటి సరదాలకు సమయం కేటాయిస్తుంటే.. సహజ మాత్రం చదువుపైనే మెుత్తం దృష్టి పెట్టింది. పుట్టిన రోజు సందర్భంగా పార్టీలనే పేరుతో వృథా ఖర్చులు చేయకుండా.. పుస్తకాల కొనుగోలుకే ప్రాధాన్యమిచ్చేది. ఒక్కోసారి కావాల్సిన మెటీరియల్స్‌కు ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చినా... తండ్రి ఏ మాత్రం సంకోచింకుండా డబ్బులు ఇచ్చేవారని సహజ చెబుతోంది.

కలల క్యాంపస్​లో సీటు

గౌలిదొడ్డి ప్రభుత్వ రెసిడెన్షియల్‌ కాలేజీలోనే ఐఐటీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతుల్ని చక్కగా వినియోగించుకున్న సహజ.. జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షలో ఎస్సీ కేటగిరిలో 1,380 ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంకుతో నచ్చిన ఐఐటీలో చదువుకునే వెసులుబాటు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఎందరో విద్యార్థుల కలల క్యాంపస్‌ ఐఐటీ బాంబేను ఎంచుకుంది. తనకు ఇష్టమైన సివిల్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశం దక్కించుకుంది.

నాకు చాలా సంతోషంగా ఉంది: సహజ తల్లి

చిన్నప్పటి నుంచి సహజ చదువుల్లో చురుగ్గా ఉంది. తమ కష్టం చూసే.. ఫ్రీ సీటు సంపాదించాలనే పట్టుదలతో చదివిందని తల్లి ప్రగతి చెబుతున్నారు. పేదింట్లో పుట్టినప్పటికీ... ఈ స్థాయిలో ర్యాంకు సాధించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు సహజ తల్లి ప్రగతి.

పుట్టి పెరిగినప్పటి నుంచి రాష్ట్రం దాటి వెళ్లలేదు. ఇప్పుడు తొలిసారిగా ముంబయి వెళ్లాల్సి వస్తోంది. పైగా అక్కడ మాట్లాడే భాష, తినే ఆహారం తెలంగాణకు కాస్త భిన్నంగా ఉంటుంది. వాటికి తొందరగా అలవాటుపడి... తన జీవిశ ఆశయమైన సివిల్స్‌ సాధనకు సన్నద్ధమవుతానని చెబుతోంది గురుకుల విద్యార్థిని సహజ.

గురుకుల విద్యార్థిని సహజ

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.