ఖమ్మం జిల్లా తల్లాడలో 1000 మంది వివిధ రంగాల కార్మికులు, పేదలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పూజారులు, ఇమామ్లు, పాస్టర్లు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, నాయి బ్రాహ్మణులు, సుతారీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, రాడ్ బైండింగ్ తదితర రంగాల వారికి అందించారు.
రేషన్ బియ్యంతో పాటు సరకులు కొనుగోలుకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1500 జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజవకర్గంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులు, రోజువారీ కూలీలకు దాతలు అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల తలసేమియా రోగుల సహాయార్ధం రక్తదానం చేసిన 55 మందిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాస రావు, జడ్పీటీసీ ప్రమీల, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.