ఖమ్మం జిల్లా మధిరలో శ్రీకృష్ణాష్టమి సంబురాలు వైభవంగా నిర్వహించారు. గీతా మందిరంలో రాధా కృష్ణులకు జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, విద్యార్థులు శ్రీకృష్ణాగోపికల వేషధారణలు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణులను కీర్తిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. కృష్ణుల వేషధారణలో ఉన్న వారితో ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరిపించారు.
ఇవీ చూడండి : వేయి స్థంభాల ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు