ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కోళ్ల వ్యాన్.. తపాలా ఉద్యోగి మృతి - road accident in khammam district

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఇమామ్ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కోళ్ల వ్యాన్ ఢీకొని.. తపాలా ఉద్యోగి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Ghora road accident took place near Imam Nagar in Enkoor mandal of Khammam district
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కోళ్ల వ్యాన్.. తపాలా ఉద్యోగి మృతి
author img

By

Published : Feb 23, 2021, 11:57 AM IST

డ్రైవర్‌ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఇమామ్ నగర్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని... కోళ్ల వ్యాన్ ఢీకొట్టడంతో తపాలా ఉద్యోగి వేముల కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. కొత్తగూడెంలో పోస్ట్‌మాన్‌గా పని చేస్తున్న కృష్ణ ఉదయాన్నే తన ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రహదారి పక్కన ముళ్లపొదల్లో ఉన్న మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అన్నం ఫౌండేషన్‌కు సమాచారం అందించగా బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రహదారికి అడ్డంగా వ్యాన్ బోల్తా పడటంతో ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిలో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

ఇదీ చదవండి: అమ్మాయిల కిడ్నాప్‌కు యత్నం.. చితక్కొట్టిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.