ఖమ్మం రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి బాలురను ప్రశ్నించగా పొంతనలేని సమాధానమిచ్చారని పోలీసులు తెలిపారు.
వారి సంచులను తనిఖీ చేయగా రూ. మూడున్నర లక్షల విలువైన 38 కిలోల గంజాయి బయటపడ్డాయన్నారు. ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారని జీఆర్పీ సీఐ చంద్రభాను వెల్లడించారు. వారిని జువైనల్ కోర్టుకు తరలిస్తామని భాను తెలిపారు.
ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు