ETV Bharat / state

అశ్రునయనాల మధ్య శ్రీనివాస్​ రెడ్డి అంత్యక్రియలు

ఆర్టీసీ కార్మికల హక్కుల సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న కార్మికుడు శ్రీనివాస్​ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు.. అమరుడు శ్రీనివాస్​రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. మృతదేహం ఖమ్మం జిల్లా సరిహద్దుకు చేరినప్పటి నుంచి.. అంత్యక్రియలు ముగిసేవరకూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు సంతాపంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్​కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది.

శ్రీనివాస్​ రెడ్డి అంత్యక్రియలు
author img

By

Published : Oct 14, 2019, 6:06 AM IST

Updated : Oct 14, 2019, 6:51 AM IST

అశ్రునయనాల మధ్య శ్రీనివాస్​ రెడ్డి అంత్యక్రియలు

ప్రభుత్వ ప్రకటనతో మనస్తాపం చెంది ఆత్మబలిదానం చేసుకున్న ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్​ దేవిరెడ్డి శ్రీనివాస్​ రెడ్డికి సహచరులు, పలు సంఘాలు, రాజకీయ పార్టీలు అంతిమ వీడ్కోలు పలికాయి. అమరుడైన సహచరుడుకి కన్నీటి నివాళి అర్పించేందుకు కార్మిక లోకం, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తరలివచ్చాయి.

ప్రముఖుల నివాళులు

హైదారాబాద్​లోని డీఆర్​డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీనివాస్​రెడ్డి పార్థివదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో శవపరీక్ష అనంతరం.. ఖమ్మంకు తరలించారు. విగతజీవిగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీనివాస రెడ్డి మృతదేహానికి ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ రాజిరెడ్డితోపాటు కార్మికులు నివాళులర్పించారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కరీంనగర్​ భాజపా ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, జితేందర్ రెడ్డితోపాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శ్రీనివాస్​ రెడ్డికి నివాళి అర్పించారు.

భారీ పోలీస్ బందోబస్తు

శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు సోమవారం నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించినప్పటికీ... జిల్లా అధికారుల సూచన మేరకు ఆదివారం రాత్రే నిర్వహించేందుకు అంగీకరించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర భారీ పోలీస్ బందోబస్తు మధ్య సాగింది. బైపాస్ రోడ్డు మీదికి వచ్చిన తర్వాత.. డిపో వైపు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టగా.. పోలీసులు అంగీకరించలేదు. కాసేపు ఐకాస నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు అంగీకరించడం వల్ల ఆర్టీసీ డిపో మీదుగా స్మశానవాటికకు అంతిమయాత్ర సాగింది.

నేడు ఖమ్మం బంద్

డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి బలిదానానికి సంతాపంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్​కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. ఈ బంద్ కు రాజకీయ పార్టీలు, విద్యార్థిసంఘాలు మద్దతు ప్రకటించాయి.

ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."

sample description
Last Updated : Oct 14, 2019, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.