రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి.. తండ్రికి తగిన తనయురాలని నిరూపించుకుంది ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌రావు కుమార్తె కృతిక. ప్రస్తుతం ఆరో తరగతి చదువుకుంటోంది. ఆ చిన్నారి మనోధైర్యం ముందు ఓటమి తల వంచింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ఎఫ్ఆర్వో సీహెచ్ శ్రీనివాసరావు ఈ నెల 22న గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
తండ్రి ప్రోత్సాహంతో అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న కుమార్తె కృతిక.. ఇలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం చాటుకుంది. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి ఖమ్మం సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్‌లో బంధువుల సాయంతో హాజరైంది. అండర్ 10 విభాగంలో లాంగ్‌జంప్‌లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. డిసెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. నిర్వాహకులు, కోచ్‌లు చిన్నారి మనోధైర్యాన్ని మెచ్చుకున్నారు.
ఇవీ చదవండి: