ఖమ్మం జిల్లా చిన్న బీరవల్లిలో వాగు పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో అటువైపు వచ్చిన కారు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. స్పందించిన స్థానికులు కారులో ఉన్న నలుగురు వ్యక్తులను ప్రాణాలతో కాపాడారు.
రాపల్లి నుంచి బోనకల్ వస్తుండగా మధిరకు చెందిన ఇద్దరు, బ్రాహ్మణపల్లికి చెందిన ఒకరు, పొద్దుటూరుకు చెందిన మరొకరు నీటి ప్రవాహానికి కొట్టుకుని పోతుండగా ఆ ప్రాంత వాసులు కాపాడారు. చివరకు కారు పోయింది.. బతుకు జీవుడా అంటూ వారు ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదీ చూడండి : చిన్న పిల్లలకు కూడా తాపించండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్