ఖమ్మం జిల్లాను తొలకరి వర్షాలు పలకరించగానే.. రైతన్నలు సాగుకు సన్నద్ధమయ్యారు. రోహిణి కార్తెలోనే విత్తనాలు చల్లుకోవాలని విత్తనాల కొనుగోలు కోసం ఖమ్మంకు భారీగా తరలివచ్చారు. గాంధీచౌక్‌లోని విత్తనాల దుకాణాల ఎదుట గుంపులుగా చేరారు. ఒకేసారి వందల మంది రైతులు దుకాణాల వద్దకు చేరుకోగానే రద్దీ ఏర్పడింది. మూడో పట్టణ ప్రాంతం రైతులతో సందడిగా మారిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వారిని గుంపులుగా ఉండకుండా చెదరకొట్టారు.
ఎక్కువగా మిరప, పత్తి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. అయితే గతేడాది కంటే ఈసారి మిరప విత్తనాలు ధర భారీగా పెంచారు. పోయిన సారి 450 రూపాయలు పలికిన ప్యాకెట్ ధర ఇప్పుడు 950 రూపాయలకు అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు సిండికేటై ధరలు అమాంతం పెంచారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని కల్తీ విత్తనాలు రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా