ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం, బిల్లుపాడు, వెంకటగిరి ప్రాంతాల్లో రబీ సాగుకు సాగర్ జలాలు రావడం లేదని రైతులు ఆరోపించారు. 10 రోజులుగా నీళ్లులేక చేతికొచ్చిన వరి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పొట్ట పోసుకున్న వరిసాగు నీరు రాక ఎండిపోతోందని తల్లాడ ఎన్నెస్పీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎండిన కంకులను తహసీల్దార్ శ్రీలతకు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు.
సాగునీటిని పుష్కలంగా ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. తమకు నీళ్లు అందడం లేదన్నారు. కూతవేటులో ప్రధాన కాలువ ప్రవహిస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చూడండి: రైతులకు ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలి: భట్టి