పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... రైతులు ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు. వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్న ఆదివాసులకు, పోడు చేసుకుంటున్న గిరిజనేతరులకు భూమిపై హక్కు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ