ఖమ్మం జిల్లా రైతులు వ్యవసాయ పద్ధతులు అనుసరించడంలో రాష్ట్రంలో గుర్తింపు సాధించారని జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఝాన్సీ లక్ష్మీ కుమారి అన్నారు. లాభసాటి పద్ధతులు అధ్యయనం చేసి అనుసరించడం మంచి ఆలోచన అన్నారు. ఈ పద్ధతిని ప్రతి రైతు పాటించాలని ఆమె సూచించారు. గతేడాది రఘునాథపాలెం మండలం రైతులు నేరుగా వరి సాగును క్షేత్ర స్థాయిలో పరిశీలించి మంచి దిగుబడులు సాధించినట్లు పేర్కొన్నారు.
ఆధునిక పద్ధతులు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత సాగు పద్ధతులపై రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా సూచించిన మేరకు పంటలు సాగు చేయాలన్నారు. వానాకాలంలో మొక్కజొన్నకు బదులు కంది, పత్తి పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. గతేడాది జిల్లాలో 59 శాతం సాగు చేశారని ఈ ఏడాది 75 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.