ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాలతో భద్రత నడుమ తరలించారు.
నగర సమీపంలోని తనికెళ్ళ విజయయంత్ర కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు వరకు పటిష్ఠ బందోబస్తు మధ్య ఈవీఎంలకు భద్రత కల్పించనున్నారు.
ఇవీ చూడండి : మొరాయించిన ఈవీఎంలు... పలుచోట్ల పోలింగ్ ఆలస్యం