ETV Bharat / state

'భవిష్యత్తులో సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తా' - మున్సిపోల్స్​ ప్రచారం తాజా వార్త

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసిన తెరాస ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను చూసి పుర ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.  పలు కుల సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ నామా నాగేశ్వర​రావు, ఎమ్మెల్యే సండ్ర హాజరయ్యారు.

election campaign in khammam
'భవిష్యత్తులో సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తా'
author img

By

Published : Jan 19, 2020, 10:54 AM IST

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో 23 వార్డులకు గాను 23 వార్డులు గెలిపించాలని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు కుల సంఘాలతో నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను చూసి దేశంలోని మిగతా రాష్ట్రాల వారు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. ఇతర పార్టీల వారు వచ్చి చెప్పే మోసపు మాటలు నమ్మవద్దన్నారు. సత్తుపల్లిని అభివృద్ధి పదంలో నడిపేది ఒక తెరాస పార్టీ అని గమనించి ఓటు వేయాలని నామ తెలిపారు.

ప్రజల మధ్య ఉంటూ మీరు చెప్పిన పని ఏది విస్మరించకుండా చేస్తున్నామని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఛైర్మన్ అవడానికి అభ్యర్థులను పోటీ పెట్టలేని పార్టీలు వచ్చి మీకు చెప్పే మాటలు వాస్తవాలు కావని ఆయన అన్నారు. భవిష్యత్తులో కొత్త జిల్లాల ప్రతిపాదన ప్రభుత్వం చేస్తే మీ ప్రతినిధిగా సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సండ్ర హామీ ఇచ్చారు.

'భవిష్యత్తులో సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తా'

ఇవీ చూడండి: క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం

Intro:TG_KMM_11_18_TRS_ANNIKAL_PRACHARAM_VO_TS10047_HD

Body:సత్తుపల్లి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెరాస ప్రభుత్వం ఆరేళ్లలో లో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో 23 వార్డులకు గాను 23 వార్డులు గెలిపించాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు కుల సంఘాలతో ఎంపీ నామా నాగేశ్వరరావు ,ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను చూసి దేశంలోని మిగతా రాష్ట్రాల వారు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. ఇతర పార్టీల వారు వచ్చి మీకు చెప్పే మాయ , మోసపు మాటలు నమోదు అన్నారు. సత్తుపల్లి ని అభివృద్ధి పదంలో నడిపేది ఒక తెరాస పార్టీ అని గమనించి సత్తుపల్లి ఓటర్లు ఓటు వినియోగించుకోవాలని తెలిపారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ... ప్రజలమధ్య ఉంటూ మీరు చెప్పిన పని ఏది విస్మరించకుండా చేస్తున్నాం అని తెలిపారు. గిరిజనుల పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని గమనించాలన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ అవడానికి అభ్యర్థులు పోటీ పెట్టలేని పార్టీలు వచ్చి మీకు చెప్పే మాటలు వాస్తవాలు కావన్నారు. ఎన్నికల కోసం సత్తుపల్లి అభివృద్ధి చేయడం లేదని దూరదృష్టితో ఖమ్మం పట్టణానికి పోటీగా సత్తుపల్లి తీర్చిదిద్దాలనే ప్రణాళికతో ఇప్పటికే 45 కోట్లు మంజూరు చేశామన్నారు. సత్తుపల్లి జిల్లా కు అన్ని అర్హతలు ఉన్నాయని కొన్ని సాంకేతిక కారణాల వల్ల జిల్లా నిలిచిపోయిందని తెలిపారు. భవిష్యత్తులో కొత్త జిల్లాల ప్రతిపాదన ప్రభుత్వం చేస్తే మీ ప్రతినిధిగా సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.