ETV Bharat / state

నాడు ఉచిత వైద్యం చేశాడు.. నేడు వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు! - Khammam News

ఒకప్పుడు పేదలందరికీ ఉచితంగా వైద్యం చేశారాయన. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా.. వైద్యో నారాయణ హరి అనే పదానికి చిరునామాగా నిలిచారు. కానీ.. ఇప్పుడు ఆయనను విధి వెక్కిరించింది. అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేక.. సాయం చేసే వారి కోసం ఎదురుచూస్తున్నారు.

Dr Krishnamacharya Need Help In Critical Health Situation In Khammam
నాడు ఉచిత వైద్యం చేశాడు.. నేడు వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు!
author img

By

Published : May 22, 2020, 11:26 PM IST

పేరు.. డాక్టర్​ నరగిరినాథుని కృష్ణమాచార్యులు. ఊరు.. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మార్టూరు. యాభై ఏళ్ల క్రితం ఆ చుట్టుపక్కల ఆయన పేరు తెలియని పేదవాడుండే వాడు కాదు. అనారోగ్యంతో తన దగ్గరికి వచ్చివ పేదవారికి ఉచితంగా వైద్య చేసేవారు. వైద్యో నారాయణా హరి అనే వాక్యానికి నిలువెత్తు రూపంలా ఉండేవారు. కానీ.. కాలం అందరినీ ఒకేలా చూడదు. నలుగురికి సాయం చేసిన వారికే..సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి కల్పించింది.

ఇప్పుడు డాక్టర్​ కృష్ణమాచార్యులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అనారోగ్యంతో మంచం పట్టారు. వయసులో ఉన్నప్పుడు ఏనాడూ సంపాదన గురించి ఆలోచించలేదు. తన చదువు పేదలకు ఉపయోగపడితే చాలనుకునేవారు. అందుకే.. పెద్దగా సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు గుండె, వెన్నెముక సంబంధ వ్యాధి వచ్చి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. వైద్యం చేయించుకునే స్తోమత లేక.. సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. కృష్ణమాచార్యులు పరిస్థితి తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగలేటి సుధాకర్​ రెడ్డి స్వయంగా కృష్ణమాచార్యులను కలిసి.. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తానని మాటిచ్చారు.

ఇవీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.